సుమధుర గాయకుడికి బర్త్‌డే విషెస్‌..

SP Balasubrahmanyam Celebrates His Birthday - Sakshi

ట్విటర్‌లో ట్రెండింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 73వ బర్త్‌డే సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. అభిమాన గాయకుడికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలుపడంతో ట్విటర్‌ టాప్‌ ట్రెండ్స్‌లో నిలిచింది. బాలుగా పేరొందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వేలాది పాటలకు సుమధుర గాత్రంతో ప్రాణం పోశారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఆరు జాతీయ ఫిల్మ్‌ అవార్డులు, 25 సార్లు ఏపీ ప్రభుత్వ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2001లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మవిభూషణ్‌ అవార్డు ఆయనను వరించాయి.

చదవండి : ఎస్పీ బాలు నోటా కరోనా పాట!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top