ఒకటే నినాదం.. సోలో బ్రతుకే సో బెటర్‌

Solo Brathuke So Better Release Date Of Announced - Sakshi

సాయితేజ్‌ హీరోగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బి. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ నెల రెండో వారంలో ఈ చిత్రం థీమ్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్‌లో జరుగుతోంది. ‘‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్‌ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్‌’’ అన్నారు సాయితేజ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top