శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ | So soon after extravaganza of Bahubali,Srimanthudu simplicity, varma | Sakshi
Sakshi News home page

శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ

Aug 7 2015 9:30 AM | Updated on Sep 3 2017 6:59 AM

శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ

శ్రీమంతుడిది ఓ అద్భుత విజయం: వర్మ

ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది.

హైదరాబాద్: ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమాపై విడుదలకు ముందే ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీమంతుడు సినిమా సింపుల్ అండ్ ప్లెయిన్ మూవీగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఒక గొప్ప విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీగా తీసిన బాహుబలి తర్వాత.. శ్రీమంతుడు నేరుగా మనసును తాకి అద్భుత విజయం సాధించిందన్నారు.

మంచి ఛార్మింగ్ ఉన్న నటుడు క్లోజప్లో నటిస్తే అంతకంటే అద్భుతమైన విజువల్ ఏమీ ఉండదని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విటోరియో స్టొరారో చెప్పారని అన్నారు. మహేశ్ బాబు లాంటి మంచి నటుడు క్లోజప్లో చేస్తే.. అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ కలిగించే ప్రభావం కంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. వందల కోట్లతో వందలాది రోజుల షూటింగు చేస్తేనే కాదని.. సింపుల్ స్టోరీ, ప్లెయిన్ క్లోజప్స్తో కూడా మాయ చేయొచ్చని శ్రీమంతుడు సినిమా రుజువు చేసినట్లు రాంగోపాల్ వర్మ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement