బాహుబలితో ఢీ..! | Small movies ready to fight with Baahubali The Conclusion | Sakshi
Sakshi News home page

బాహుబలితో ఢీ..!

Apr 19 2017 12:59 PM | Updated on Sep 5 2017 9:11 AM

బాహుబలితో ఢీ..!

బాహుబలితో ఢీ..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుండటంతో ఆ దరిదాపుల్లో

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుండటంతో ఆ దరిదాపుల్లో ఓ మాదిరి సినిమా రిలీజ్ చేయడానికి కూడా సినీ ప్రముఖుల సాహసించటం లేదు. బాహుబలి రిలీజ్కు ముందు వారం ఒకటి రెండు సినిమాలను విడుదల చేస్తున్నా.. రిలీజ్ తరువాత మాత్రం పదిహేను రోజుల పాటు మరే సినిమా థియేటర్లలోకి రాదని భావించారు.

కానీ అందరికీ షాక్ ఇస్తూ చిన్న సినిమాలు బాహుబలితో ఢీ అంటున్నాయి. ఇప్పటికే బాహుబలి రిలీజ్ అయిన వారం తరువాత అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన బాబు బాగా బిజీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు మరో చిన్న సినిమా మరింత రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది. హ్యాపిడేస్ ఫేం రాహుల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాపురం సినిమాను బాహుబలి రిలీజ్ అయిన తరువాతి రోజు (ఏప్రిల్ 29)న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

ఎవరి మార్కెట్ వారిదే అనుకున్నారో లేక, బాహుబలి టికెట్ దొరకని వారైనా మన సినిమా చూస్తారని భావిస్తున్నారో  గాని.., వెంకటాపురం చిత్రయూనిట్ నిర్ణయానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిన్న సినిమా బాహుబలి సునామీని తట్టుకొని ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement