నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి | Sakshi
Sakshi News home page

నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి

Published Fri, Sep 7 2018 1:03 AM

silly fellows pre release function - Sakshi

‘‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్‌ వర్కర్‌ కాబట్టే సినిమాలన్నీ సూపర్‌ హిట్స్‌ అవుతున్నాయి. నరేశ్, సునీల్‌.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్‌ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’.

కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు  విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్‌ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్‌ హిట్‌ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్‌’ సినిమాకు ఎంత ఎంజాయ్‌ చేశానో ‘సిల్లీ ఫెలోస్‌’కి కూడా అంతే ఎంజాయ్‌ చేశా.

ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్‌.  ‘‘సిల్లీ ఫెలోస్‌’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్‌. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్‌ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్‌ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్‌ కె.నాగేశ్వర్‌ రెడ్డి, నటి నందినీరాయ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement