ఆ లోటు తీరుతుంది

Silly Fellows first look launch - Sakshi

సునీల్‌

‘అల్లరి’ నరేశ్, సునీల్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. చిత్రా శుక్లా కథానాయిక. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను హైదరాబాద్‌లో లాంచ్‌ చేశారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘సుడిగాడు’ వంటి హిట్‌ చిత్రం తర్వాత నరేశ్, నా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్‌’. సునీల్‌ ఈ చిత్రంలో కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఏడాదిపాటు కష్టపడి హిట్‌ సాధించాలనే లక్ష్యంతో వస్తున్నాం. దాదాపు 200 టైటిల్స్‌ అనుకున్నాం. ఆఖరికి నా ‘ఎస్‌’ సెంటిమెంట్‌ను కూడా వదిలేద్దామనుకున్నా.

చివరికి ‘ఎస్‌’తోనే టైటిల్‌ ఫిక్స్‌ చేశాం’’ అన్నారు. ‘‘ఆడియన్స్‌ నా నుంచి ఏదైతే ఇన్నాళ్లు మిస్‌ అయ్యారో నేనూ అదే మిస్‌ అయ్యాను. ‘సిల్లీ ఫెలోస్‌’తో ఆ లోటు తీరుతుంది. ఒకప్పటి కామెడీ జానర్‌లను తలపించే సినిమా అవుతుంది’’ అన్నారు సునీల్‌. ‘‘దాదాపు మూడేళ్లు స్క్రిప్ట్‌పై వర్క్‌ చేసిన సినిమా  ‘సిల్లీ ఫెలోస్‌’. పూర్తి స్థాయి ఎంటరై్టన్మెంట్‌తో వస్తున్నాం’’ అన్నారు నరేశ్‌. ‘‘నేనే రాజు నేనే మంత్రి, ఎమ్‌.ఎల్‌.ఎ’ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న చిత్రమిది. హ్యాట్రిక్‌ సాధిస్తామని నమ్ముతున్నాం’’ అన్నారు భరత్‌ చౌదరి, కిరణ్‌ రెడ్డి. చిత్రా శుక్లా పాల్గొన్నారు.  ఈ చిత్రానికి సమర్పణ: బ్లూ ప్లానెట్‌ ఎంటరై్టన్మెంట్స్‌ ఎల్‌ ఎల్‌ పీ అండ్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కెమెరా: అనీష్‌ తరుణ్‌ కుమార్, సంగీతం: శ్రీ వసంత్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top