నా వైవాహిక జీవితం ఓ అసంపూర్ణ పుస్తకం: శ్వేతాబసు

Shweta Basu Prasad Talks About Divorce With Rohit Mittal - Sakshi

తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా అవేవీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే.. శ్వేతాబసు 2018లో రోహిత్ మిట్టల్ అనే డైరెక్టర్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే వారి వైవాహిక దాంపత్యంపై అనేక ఊహాగానాలు వెలువడగా.. తాజాగా ఈ విషయంపై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పింది. 

అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది. మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని నిర్వేదం వెలిబుచ్చింది. విడిపోయినా తాము ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటామని శ్వేతా స్పష్టం చేసింది. (దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top