అవును.. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా!

Shruti Haasan Speaks About Plastic Surgery - Sakshi

‘‘మన కోసం మనం చేసుకునే సహాయం ఏదైనా ఉందంటే మన శరీరం, మెదడులో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను గమనించడం.. వాటిని తెలుసుకోవడం... అర్థం చేసుకోవడం’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఓ ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోకి ‘శ్రుతీ చిక్కిపోయిందేంటి? ఆరోగ్య సమస్యలా? దారుణంగా ఉంది’ అంటూ నెటిజన్ల నుంచి కొన్ని  నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. తనపై వచ్చిన బాడీ షేమింగ్‌ కామెంట్స్‌కు స్పందిస్తూ రాసిన ఓ లేఖను పంచుకున్నారు శ్రుతి. దాని సారాంశం ఈ విధంగా.. ‘‘సాధారణంగా ఇతరుల అభిప్రాయాలను నేను పెద్దగా పట్టించుకోను. కానీ అదేపనిగా తను లావుగా ఉంది, సన్నగా ఉంది అంటూ చేసే విమర్శలకు స్పందించాలనిపిస్తుంది.

ఈ రెండు ఫొటోలు (ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో) కేవలం మూడు రోజుల వ్యవధిలో దిగినవి. నేను ఏం చెప్పబోతున్నానో చాలామంది స్త్రీలు అర్థం చేసుకుంటారని, రిలేట్‌ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనెప్పుడూ నా శరీరంలోని హార్మోన్ల అధీనంలోనే నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాటిని బ్యాలెన్స్‌ చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. వాటితో సమన్వయం కుదుర్చుకునే పనిలోనే ఉన్నాను. అది అనుకున్నంత సులువైన పనేం కాదు. ఆ బాధ తేలికైనదేం కాదు. శరీరంలో వచ్చే మార్పులు చెప్పినంత సులువేం కాదు. కానీ ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోవడం సులువు అనుకుంటున్నాను. ఏ వ్యక్తి అయినా సరే ఏ సందర్భంలోనూ మరో వ్యక్తిని జడ్జ్‌ చేయకూడదు. అవును.. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాను. దాంట్లో సిగ్గుపడటానికి ఏం లేదు. ఇది నా జీవితం, నా ముఖం. ప్లాస్టిక్‌ సర్జరీని నేను ప్రమోట్‌ చేయను. అది విరుద్ధమైనది అని కూడా అనను. నా ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయం అది. అయితే నన్ను విమర్శించడం కరెక్ట్‌ కాదు. ప్రస్తుతం నేను కొంచెం కొంచెంగా ప్రతిరోజూ నన్ను నేను మరింత ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో గొప్ప ప్రేమకథ మనతోనే అయ్యుండాలి. మీ జీవితం కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. ప్రేమను పంచుదాం’’ అన్నారు శ్రుతీ హాసన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top