అనుకున్నదే జరిగింది | shruti haasan Actvie on Social Media | Sakshi
Sakshi News home page

అనుకున్నదే జరిగింది

Mar 18 2019 12:57 PM | Updated on Mar 18 2019 12:57 PM

shruti haasan Actvie on Social Media - Sakshi

సినిమా: ఏం జరగాలని కోరుకున్నానో, అదే జరిగింది. చాలా సంతోషంగా ఉంది అని పేర్కొంది నటి శ్రుతీహాసన్‌. ఈ సంచలన నటి దక్షిణాది చిత్రాల్లో నటించి రెండేళ్లకు పైనే అయ్యింది. సింగం–3 తరువాత కోలీవుడ్‌లో కనిపించలేదు. ఇక టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే హిందీలో ఒక చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. సంగీత ఆల్బమ్స్‌పై మక్కువ చూపిస్తున్న ఈ బ్యూటీ బుల్లితెర యాంకరింగ్‌లోనూ ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటివరకూ కోలీవుడ్‌లో కొత్త చిత్రం గురించి  ఎలాంటి సమాచారం లేదు. అయితే తనదైన ధోరణిలో ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటోంది. అదే విధంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజక మాధ్యమాల ద్వారా తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది.

గ్లామరస్‌ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడం, అభిమానులతో ముచ్చటించడం వంటివి చేస్తూనే ఉంది. ఇదిలాఉండగా శ్రుతీహాసన్‌ ఇటీవల తాను ఏం జరగాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నానో అది జరిగింది అని, ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది. అన్ని మంచి విషయాలను ఆ భగవంతుడు తనకు ప్రసాదించారు అని అంది. దీంతో శ్రుతీహాసన్‌ దేని గురించి మాట్లాడుతోంది? అసలు ఏం చెప్పాలనుకుందో? తెలియక ఆమె అభిమానులు జుత్తు పీక్కుంటున్నారు. అసలు విషయం ఏమిటో శ్రుతీహాసన్‌ వివరిస్తే గానీ అభిమానులు ఆనందించే పరిస్థితి లేదు. ఇటీవల ఇదేవిధంగా నటి తమన్నా అంటే తనకు చాలా ఇష్టం అని, తనతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని అంది. అంతే కాదు ఆమెను పెళ్లి చేసుకోవడానికి రెడీ స్టేట్‌మెంట్‌ ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement