శ్రీయకు డబుల్ ధమాకా! | shreya going to act in bala's movie | Sakshi
Sakshi News home page

శ్రీయకు డబుల్ ధమాకా!

Feb 7 2014 11:36 PM | Updated on Sep 2 2017 3:27 AM

శ్రీయకు డబుల్ ధమాకా!

శ్రీయకు డబుల్ ధమాకా!

ఒకేసారి రెండు విలక్షణ పాత్రలు చేసే అవకాశం వస్తే, ఏ ఆర్టిస్ట్‌కైనా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ ఆ ఆనందంలోనే ఉన్నారు.

 ఒకేసారి రెండు విలక్షణ పాత్రలు చేసే అవకాశం వస్తే, ఏ ఆర్టిస్ట్‌కైనా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీయ ఆ ఆనందంలోనే ఉన్నారు. విలక్షణ దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు శ్రీయ. శశికుమార్, శ్రీయ జంటగా నటించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఇందులో కథానాయికది డాన్స్ బేస్డ్ కేరక్టర్ కావడంతో శ్రీయను తీసుకున్నారని సమాచారం. ఈ ముద్దుగుమ్మకు క్లాసికల్ డాన్స్ తెలియడం ఈ విధంగా ప్లస్ అయ్యింది.
 
  ఇక, మరో అవకాశం విషయానికొస్తే.. విద్య అనేది దాచుకోవడానికి కాదు.. సమాజ శ్రేయస్సు కోసం  పది మందికి పంచేదంటూ, కుల, మతరహితంగా అందరికీ జ్ఞానాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువు రామానుజాచార్యుల జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో రామానుజాచార్యుల భార్య బీబీ నాంచారి పాత్రను శ్రీయ పోషించనున్నారు. ఇక, శ్రీయ కెరీర్ అయిపోయిందని కొంతమంది ఫిక్స్ అవుతున్న తరుణంలో ఇలా డబుల్ ధమాకా తగలడం శ్రీయకు స్వీట్ షాక్ తిన్నట్లు అనిపించిందట. ఇటీవలే తెలుగులో ఆమె ‘మనం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా వచ్చే నెలాఖరున విడుదల కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement