'శివ'కు ముందు.. ఆ తర్వాత..
తెలుగు చలన చిత్రసీమ నిర్మాణ తీరును, దర్శకుల ఆలోచనా విధాన్నాన్ని మార్చిన చిత్రం 'శివ'. అప్పటి వరకు వచ్చిన మూస, రోటిన్ చిత్రాలకు బ్రేక్ వేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్రం శివ అని చెప్పవచ్చు.
తెలుగు చలన చిత్రసీమ నిర్మాణ తీరును, దర్శకుల ఆలోచనా విధాన్నాన్ని మార్చిన చిత్రం 'శివ'. అప్పటి వరకు వచ్చిన మూస, రోటిన్ చిత్రాలకు బ్రేక్ వేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్రం శివ అని చెప్పవచ్చు. శివ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ పాతతరం, సమకాలీన దర్శకులకు, దర్శకులుగా మారాలనుకునే యువ ఫిల్మ్ మేకర్ కు స్పూర్తిగా నిలిచారు. టాలీవుడ్ లో శివ చిత్రం ఓ సునామీలా సంచలనం సృష్టించడమే కాకుండా రికార్డులను తిరగరాసింది. శివ చిత్ర ప్రభావం, రాంగోపాల్ వర్మ మేకింగ్ ఎందర్నో ప్రభావితం చేసింది. అప్పట్లో శివ ట్రెండ్ సెట్టర్లకే ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఆ చిత్రం తర్వాత ''శివ'కు ముందు 'శివ'కు తర్వాత' అనే భావనను ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో కలిగించింది.
'శివ' చిత్రం తర్వాత అక్కినేని నాగార్జున ఇమేజ్ మారిపోయింది. ఆ చిత్రంలోనటించిన ఎంతో మంది యాక్టర్లు సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు. అంతటి ఘనతను సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదలై 25 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 'శివ' చిత్రంపై డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీని అక్టోబర్ 5 తేదిన విడుదల చేయనున్నారు. డాక్యుమెంటరీ వివరాలను గురించి వర్మ తన ట్విటర్ లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాంగోపాల్ వర్మ టాలీవుడ్ చరిత్రను తిరగరాసే చిత్రాల్ని నిర్మించాలని ఆశిద్దాం!