ఆడబిడ్డకు జన్మనిచ్చిన శిల్పాశెట్టి

Shilpa Shetty Raj Kundra Welcomes Baby Girl Junior SSK - Sakshi

ముంబై: బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తమకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు తెలిపారు. ‘‘ఇన్నాళ్ల మా ప్రార్థనలకు ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. చిట్టితల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. సమీశా శెట్టి కుంద్రా.. ఫిబ్రవరి 15న జన్మించింది. స అంటే సంస్కృతంలో కలిగి ఉండటం అని అర్థం. మిశ అంటే రష్యన్‌ భాషలో దేవత. మా ఇంటి లక్ష్మి.. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది. మా ఏంజెల్‌కు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు: రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌’’అని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.

కాగా 90వ దశకం నుంచి బాలీవుడ్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శిల్పాశెట్టి.. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు వియాన్‌ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న సరోగసీ ద్వారా వీరికి ఆడబిడ్డ జన్మించినట్లు తెలుస్తోంది. ఇక పదమూడేళ్లుగా వెండితెరకు దూరమైన శిల్పాశెట్టి.. యోగాసనాల వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. నికమ్మ టైటిల్‌తో షబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో త్వరలోనే బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.


|| Om Shri Ganeshaya Namah || Our prayers have been answered with a miracle... With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, 🧿𝐒𝐚𝐦𝐢𝐬𝐡𝐚 𝐒𝐡𝐞𝐭𝐭𝐲 𝐊𝐮𝐧𝐝𝐫𝐚🧿 Born: February 15, 2020 Junior SSK in the house😇 ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name - our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings🙏🏻❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra🧿 #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top