ఆమే లేకపోతే...! | She is the Otherwise ...! | Sakshi
Sakshi News home page

ఆమే లేకపోతే...!

Feb 3 2016 12:07 AM | Updated on Sep 3 2017 4:49 PM

ఆమే లేకపోతే...!

ఆమే లేకపోతే...!

సినిమా పరిశ్రమతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది.

‘‘సినిమా పరిశ్రమతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎప్పటి నుంచో సినిమా తీయాలనే కోరిక ఉంది. తప్పకుండా తీస్తాను. అది కూడా తొమ్మిది భాషల్లో తెరకెక్కిస్తాను. ‘లజ్జ’ చిత్రం ట్రైలర్స్, పాటలు బావున్నాయి. ఓ కొత్త కథతో తీసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని నల్గొండకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మించిన చిత్రం ‘లజ్జ’. సుక్కు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.


బిగ్ సీడీని రాజగోపాల్ రెడ్డి, పాటల సీడీని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్ మూవీ. మధుమిత లేకుంటే ఈ చిత్రం చేసేవాడిని కాదు. ఆమె చాలా అద్భుతంగా నటించింది’’ అని తెలిపారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. దీంతో ఆయనపై నమ్మకంతోనే ఈ చిత్రం చేశా’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు సాగర్, చిత్ర బృందం పాల్గొన్నారు.

Advertisement

పోల్

Advertisement