breaking news
Lajja
-
ఆమే లేకపోతే...!
‘‘సినిమా పరిశ్రమతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎప్పటి నుంచో సినిమా తీయాలనే కోరిక ఉంది. తప్పకుండా తీస్తాను. అది కూడా తొమ్మిది భాషల్లో తెరకెక్కిస్తాను. ‘లజ్జ’ చిత్రం ట్రైలర్స్, పాటలు బావున్నాయి. ఓ కొత్త కథతో తీసిన ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని నల్గొండకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మధుమిత, శివ, వరుణ్ ప్రధాన పాత్రల్లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది దర్శకత్వంలో బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మించిన చిత్రం ‘లజ్జ’. సుక్కు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. బిగ్ సీడీని రాజగోపాల్ రెడ్డి, పాటల సీడీని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్ మూవీ. మధుమిత లేకుంటే ఈ చిత్రం చేసేవాడిని కాదు. ఆమె చాలా అద్భుతంగా నటించింది’’ అని తెలిపారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. దీంతో ఆయనపై నమ్మకంతోనే ఈ చిత్రం చేశా’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ వేడుకలో దర్శకుడు సాగర్, చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఇస్లాంను ఎప్పడూ విమర్శించలేదు: తస్లీమా
న్యూఢిల్లీ: 'లజ్జ' పుస్తకంలో ఇస్లాంపై తాను ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ అన్నారు. గతంలో లజ్జ పుస్తకం వివాదస్పదమైన మారిన నేపథ్యంలో తస్లీమాపై ఫత్వా విధించిన సంగతి తెలిసిందే. తాను లజ్లలో ఇస్లాంను విమర్శించలేదని, దాంతో బంగ్లాదేశ్ లో ముస్లిం సాంప్రదాయవాదులు ఫత్వా జారీ చేశారని తస్లీం అన్నారు. ఇస్లాంను విమర్శించారనే అంశంలో వాస్తవం లేదన్నారు. ఓ నిరసనకు లజ్జ ప్రతిరూపం. హింసపై తాను నిరసన వ్యక్తం చేశా. ప్రాంతం పేరుతో హత్యలు చేయడం దారుణం అని తస్లీన్ అన్నారు. తాజాగా లజ్జను ఇంగీష్ లోకి అనువదించి..20వ ఎడిషన్ గా ప్రచురిస్తున్నారు.