96 రీమేక్‌.. తెర మీదకు మరో హీరో పేరు

Sharwanand Samantha In 96 Remake - Sakshi

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా కోలీవుడ్ లో సూపర్‌ హిట్ అయిన సినిమా 96. ఈ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ను నిర్మాత దిల్‌ రాజు సొంతం చేసుకున్నారరు. అయితే ఈ రీమేక్‌లో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని మాత్రం ఇంత వరకు ప్రకటించలేదు. కానీ రీమేక్‌ రైట్స్ సొంతం చేసుకున్న దగ్గరి నుంచి ఈ రీమేక్‌లో నటించబోయే హీరో అంటూ చాలా మంది పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

ముందుగా ఈ సినిమా నాని హీరోగా నటిస్తాడన్న ప్రచారం గట్టిగా వినిపించింది. తరువాత అల్లు అర్జున్‌ ఈ సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. తరువాత మరో హీరో గోపిచంద్ పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ క్రేజీ రీమేక్‌లో శర్వానంద్‌ నటిస్తున్నాడంటూ మరో ప్రచారం మొదలైంది. హీరోగా ఎవరి పేరు వినిపించినా హీరోయిన్‌ గా మాత్రం సమంత ఫిక్స్ అన్న టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top