మాజీ క్రికెటర్ కు జోడీగా 'రౌడీ' హీరోయిన్ | Shanvi Srivastava is Sreesanth's heroine | Sakshi
Sakshi News home page

మాజీ క్రికెటర్ కు జోడీగా 'రౌడీ' హీరోయిన్

Nov 25 2015 1:07 PM | Updated on Sep 3 2017 1:01 PM

మాజీ క్రికెటర్ కు జోడీగా 'రౌడీ' హీరోయిన్

మాజీ క్రికెటర్ కు జోడీగా 'రౌడీ' హీరోయిన్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా దక్షిణాదిలో తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి సరసన శాన్వి నటించే అవకాశాలున్నాయి.

హైదరాబాద్: మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా దక్షిణాదిలో తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అతడి సరసన శాన్వి నటించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని సానా యాదిరెడ్డి సూచనప్రాయంగా ధ్రువీకరించారు. ఆమెతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని, షూటింగ్ డేట్స్ గురించి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. శాన్వి ఇంతకుముందు లవ్ లీ, అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది.

శ్రీశాంత్ తో నటించేందుకు శాన్వీ అంగీకరించిందని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆమెకు కథ బాగా నచ్చిందని తెలిపాయి. శ్రీశాంత్ లో సన్నిహితంగా మెలిగిన హీరోయిన్ పాత్రలో ఆమె ఈ సినిమాలో కనిపించనుందని వెల్లడించాయి. శ్రీశాంత్ జీవితంలో ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం శ్రీశాంత్ బరువు కూడా తగ్గాడు. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీని కంటే ముందు 10 రోజుల పాటు నటీనటులకు యాక్టింగ్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement