సల్మాన్తో కాదని అజయ్తో | Shah Rukh Khans Raees to Clash With Ajay Devgns Shivaay This Diwali | Sakshi
Sakshi News home page

సల్మాన్తో కాదని అజయ్తో

Apr 16 2016 11:57 AM | Updated on Sep 3 2017 10:04 PM

సల్మాన్తో కాదని అజయ్తో

సల్మాన్తో కాదని అజయ్తో

ఈ ఏడాది రంజాన్కు బాలీవుడ్ తెర మీద భారీ యుద్ధం తప్పదని భావించారు అంతా.. సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో పాటు, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్ సినిమాలు...

ఈ ఏడాది రంజాన్కు బాలీవుడ్ తెర మీద భారీ యుద్ధం తప్పదని భావించారు అంతా.  సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సుల్తాన్ సినిమాతో పాటు, షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న రాయిస్ సినిమాలు ఈద్ బరిలో పోటీ పడతాయని అనుకున్నారు. అయితే సల్మాన్తో ఇప్పుడిప్పుడే బలపడుతున్న స్నేహం కారణంగా బరిలో నుంచి తప్పుకున్న షారూఖ్ తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. దీంతో ఈద్ కు సోలోగా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు సల్మాన్.
 
అయితే ఈద్ బరి నుంచి తప్పుకున్న షారూఖ్, తన సినిమా రాయిస్ను దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఆ సమయంలో కూడా బాద్ షాకు పోటీ మాత్రం తప్పేలా కనిపించటం లేదు. అజయ్ దేవగన్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న శివాయ సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి సల్మాన్తో పోటీ వద్దని పక్కకు జరిగిన షారూఖ్, అజయ్ కోసం మరోసారి తన సినిమా వాయిదా వేసుకుంటాడా లేక బరిలో దిగుతాడా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement