ఈ సినిమా కూడా ఫెయిలయితే...

Shah Rukh Khan On Zero If This File Does Not Work I Will Not Get Work For 6 Or 10 Months - Sakshi

వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్నారు బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌. ఆయన నటించిన ఫ్యాన్‌, రాయిస్‌, దిల్‌వాలే వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో షారుక్‌ హీరోగా వచ్చిన ‘జబ్‌ హ్యారి మెట్‌ సెజల్‌’ చిత్రం ఘోర పరాజయాన్ని చవి చూసింది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ. 64. 33 కోట్లు మాత్రమే వసూలు చేసింది. వరుస పరాజయాలు పలకరిస్తున్నప్పటికీ షారుక్‌ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం జీరో. , అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్‌ పత్రికతో మాట్లాడిన షారుక్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘భారీ హిట్‌ కొట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. మళ్లీ అలాంటి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నాను కానీ కుదరడం లేద’ని అన్నారు. ఈ శుక్రవారం రిలీజ్‌ కాబోతున్న జీరో చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ఫలితం ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. దాన్ని నేను మార్చలేను కూడా. మరి మార్చడానికి కుదరని అంశాల గురించి నేను ఎందుకు ఆలోచించాలి’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ‘జీరో చిత్రం షారుక్‌ కెరీర్‌కి చాలా ముఖ్యమైంది.. కచ్చితంగా విజయం సాధించాలని జనాలు అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఈ సినిమా కూడా ఫెయిల్‌ అయ్యిందనుకొండీ.. అప్పుడు మహా అయితే ఓ 6 - 10 నెలల పాటు నేను సినిమాలు చేయను. కానీ నా నైపుణ్యం, కళ మంచివని నమ్మినన్ని రోజులు మరిన్ని సినిమాలు చేస్తూనే ఉంటాను’ అని షారుక్‌ బదులిచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top