
సలార్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తర్వాత ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డ మూవీ ఇదే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది.
అయితే తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్తో పాటు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెప్పారు. మేము సలార్ డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకోలేదన్నారు. కానీ జ్యోతిష్యం వల్ల ఆ తేదీనే విడుదల చేయాల్సి వచ్చిందని ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కాగా.. ప్రభాస్ సలార్ రిలీజ్‌కు ముందే రోజే షారూఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన డుంకీ థియేటర్లలో రిలీజైంది. మరుసటి రోజే సలార్ విడుదల కావడంతో డుంకీ మూవీపై ప్రభావం పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద డుంకీ రాణించలేకపోయింది. అందుకే ఈ విషయంలో తనను క్షమించాలని సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డుంకీ టీమ్‌ను కోరారు.
"I apologise to #Dunki team for this clash. #SRK sir & Hirani sir are colossal & announced date way before. We didn't want #Salaar to come on this date, it happened due to astrology" :Prashanth Neel
Salaar would have been easy 1000crs if not for Clash.
pic.twitter.com/Pi0dvqBgFC— Pan India Review (@PanIndiaReview) August 6, 2025