‘అలా పిలిస్తే ఇబ్బందిగా ఉంటోంది’

Shah Rukh Khan Said Actors and Actresses Should Get Same Fee - Sakshi

చేసే పని ఒక్కటే అయినప్పుడు వేతనం కూడా ఒకే రకంగా ఇవ్వాలి. కానీ అలా ఉండటం లేదు. ఈ వివక్షతకు వ్యతిరేకంగా ఈ మధ్యే ఉద్యమాలు కూడా వస్తోన్నాయి. ఈ పరిస్థితి అంతటా ఉంది. అయితే మిగితా చోట్ల కన్నా సినీ పరిశ్రమలో ఈ వ్యత్యాసం ఇంకాస్తా ఎక్కువే. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు ఇచ్చే పారితోషికం చాలా తక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పిడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకున్నహీరోయిన్‌గా  దీపికా పదుకొనే రికార్డు సృష్టించారు. ‘పద్మావత్‌’ సినిమాకు గాను దీపికా, రణ్‌వీర్‌ సింగ్‌, షాహీద్‌ కపూర్‌ల కన్నా ఎక్కువ పారతోషికం తీసుకున్నారు.

ఈ విషయం గురించి బాలీవుడ్‌ ‘కింగ్‌ ఖాన్‌’ షారుక్‌ ఖాన్‌ తొలి ప్రాధన్యత మహిళలకే ఇవ్వాలి.. వారికే ముందు గుర్తింపు దక్కాలి.. వారి తర్వాతే మేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇది పురుషాధిక్య సమాజం. ఉన్నపళంగా దీన్ని మార్చడం కుదరదు. అలా అని పట్టించుకోకుండా ఉండలేం. కష్టపడే విషయంలో హీరో - హీరోయిన్‌ అంటూ తేడా లేనప్పుడు పారితోషికం విషయంలో వ్యత్యాసం ఎందుకో నాకు అర్థం కావడం లేదు’ అన్నారు.

షారుక్‌ మాట్లాడుతూ.. ‘ప్రతిభ ఆధారంగా వేతనం ఉండాలి.. కానీ స్త్రీనా, పురుషుడా అనే దాన్ని బట్టి తేడాలు చూపకూడదు’ అన్నారు. అంతేకాక ‘బాలీవుడ్‌లో నా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇక్కడ మాధురి దీక్షిత్‌, జూహీ చావ్లా, శ్రీదేవి లాంటి ఎందరో గొప్ప హీరోయిన్‌లు ఉన్నారు. వారందరిని వదిలిపెట్టి నన్ను స్టార్‌ అనడం సమంజసం కాదు. ఎవరైనా నన్ను స్టార్‌ అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఏ విషయంలోనైనా లేడీస్‌ ఫస్ట్ అంటాం. అలాంటిది సినిమా ప్రారంభంలో పేర్లు వచ్చే సమయంలో మాత్రం హీరోయిన్‌ల పేరు హీరోల పేరు తర్వాతే వస్తోంది. మరి ఇదేం న్యాయం. అందుకే  నా సినిమాల్లో ముందు హీరోయిన్‌ పేరు వేసి.. ఆ తర్వాత నా పేరు వేయడం ప్రారంభించాను’ అని తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top