ఇద్దరు కలిసిన ఈద్‌

Shah Rukh Khan and Salman Khan come together in Zero teaser release - Sakshi

బాద్‌షా, భాయ్‌ బాలీవుడ్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చారు. ‘జీరో’ కోసం కలిసిన ఈ హీరోలిద్దరూ ఈద్‌ శుభాకాంక్షలు తెలిపారు. షారుక్‌ ఖాన్‌ హీరోగా ఆనంద్‌ ఎల్‌. రాయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జీరో’. ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు షారుక్‌. ఈ చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈద్‌ సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను గురువారం రిలీజ్‌ చేశారు.

టీజర్‌లో ‘చేయి కలుపు బ్రదర్‌’  అంటూ షారుక్, సల్మాన్‌ డ్యాన్సులతో స్క్రీన్‌ను మెరిపించారు. బ్రదర్స్‌ ఇద్దరం కలసి హిందూస్థాన్‌కి ఈద్‌ ముబారక్‌ చెబుతున్నాం అంటూ షారుక్‌ని సల్మాన్‌ ఎత్తుకోవడం.. సల్మాన్‌కి ముద్దిస్తున్న షారుక్‌ ఖాన్‌ టీజర్‌ ఇద్దరి అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top