రహస్య వివాహమా? | secrete marriage ? | Sakshi
Sakshi News home page

రహస్య వివాహమా?

Oct 28 2013 1:10 AM | Updated on Sep 2 2017 12:02 AM

రహస్య వివాహమా?

రహస్య వివాహమా?

తాను రహస్య వివాహం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని రమ్యా నంబీశన్ పేర్కొంది. కుళ్లనది కూట్టం,

 తాను రహస్య వివాహం చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం దిగ్భ్రాంతికి గురి చేసిందని రమ్యా నంబీశన్ పేర్కొంది. కుళ్లనది కూట్టం, పిజ్జా తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ కేరళ కుట్టి తాజాగా గాయని అవతారమెత్తింది. దీపావళికి విడుదలకు సిద్ధమవుతున్న పాండియనాడు చిత్రంలో ఈ బ్యూటీ ఒక పాట పాడింది.
 
  రమ్యా నంబీశన్ ప్రేమ వివాహం గురించి కొంతకాలంగా వదంతులు జోరుగా ప్రచారమవుతున్నాయి. మలయాళ చిత్రంలో తనతో నటించిన ఉన్ని ముకుందన్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని రమ్యా నంబీవన్ తీవ్రంగా ఖండించింది. తాను రహస్య వివాహం చేసుకున్నానన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. తాను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్ చేసింది లేదని, అసలు సినిమా నటిని పెళ్లి చేసుకోనని ఉన్నిముకుందన్ తేల్చి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement