‘డియర్‌ కామ్రేడ్‌’ నుంచి రెండో పాట | Second Single From Vijay Devarakonda Dear Comrade | Sakshi
Sakshi News home page

‘డియర్‌ కామ్రేడ్‌’ నుంచి రెండో పాట

May 9 2019 8:36 PM | Updated on May 9 2019 8:36 PM

Second Single From Vijay Devarakonda Dear Comrade - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నేడు పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాడు. తన అభిమానులు మాత్రం తదుపరి చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్‌డేట్‌ వస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే డియర్‌ కామ్రేడ్‌ జూలై 26న వస్తున్నట్లు ప్రకటించిన చిత్రబృందం మరో అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది.

ఈ చిత్రం నుంచి రెండో పాటను ఆదివారం మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మొదటి పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రంలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది. భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ నిర్మిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement