లాయర్‌.. ఓ దొంగ... ఓ అమ్మాయి!

Say hello to Shraddha Kapoor’s ‘Nauti’ avatar - Sakshi

బాలీవుడ్‌ స్పైస్‌

కామన్‌ పీపుల్‌ ఫేస్‌ చేస్తోన్న ఎలక్ట్రిసిటీ పవర్‌ ప్రాబ్లమ్స్‌ను బేస్‌ చేసుకుని ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో హిందీలో రూపొందుతున్న చిత్రం ‘బట్టీ గుల్‌ మీటర్‌ ఛాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధాకపూర్, యామీ గౌతమ్‌ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లో స్టారై్టంది. ఉత్తరాఖండ్‌ సీయం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమాలో లలితా నౌటియాల్‌ అలియాస్‌ నౌటీ క్యారెక్టర్‌లో శ్రద్ధా కపూర్‌ కనిపించనున్నారు. నౌటీ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

సినిమాలో యామీ గౌతమ్‌ లాయర్‌గా నటిస్తుండగా, పవర్‌ను దొంగలించే రోల్‌లో షాహిద్‌ కనిపించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్‌ మ్యాటర్‌ కూడా ఉందండి. అదేంటంటే.. సినిమాలో షాహిద్‌కపూర్‌ మాత్రమే కాదు.. శ్రద్ధాకపూర్‌ని ఇంకో హీరో కూడా ప్రేమిస్తారట. దాంతో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ స్టార్ట్‌ అవుతుందని బాలీవుడ్‌ సమాచారం. జనరల్‌గా ఇక్కడున్న ఫొటోలో కనిపిస్తున్నట్లుగా శ్రద్ధా చాలా గ్లామరస్‌గా కనిపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం డీ–గ్లామరస్‌ పాత్రలో కనిపించనున్నారట. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top