యువర్‌ ఆనర్‌ | Saptagiri LLB Movie started on Thursday. | Sakshi
Sakshi News home page

యువర్‌ ఆనర్‌

Jun 23 2017 12:24 AM | Updated on Sep 5 2017 2:14 PM

యువర్‌ ఆనర్‌

యువర్‌ ఆనర్‌

హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన సప్తగిరి హీరోగా చేసిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ మంచి విజయం అందుకుంది.

హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరించిన సప్తగిరి హీరోగా చేసిన తొలి చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ మంచి విజయం అందుకుంది. ఆ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ సప్తగిరి హీరోగా రెండో చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’కి శ్రీకారం చుట్టింది. హిందీ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ తొలి భాగానికి రీమేక్‌గా చరణ్‌ లక్కాకులను దర్శకత్వంలో  డా. రవికిరణ్‌ నిర్మించనున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది.


తొలి సన్నివేశానికి డా. రవికిరణ్‌ కుమార్తెలు బేబీ ఐశ్వర్య, బేబీ అస్మిత కెమెరా స్విచ్చాన్‌ చెయ్యగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ ఇచ్చారు. సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు గౌరవ దర్శకత్వం వహించారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాను మేం ఊహించినదానికంటే పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ సూపర్‌హిట్‌ సాధించాలనే పట్టుదలతో ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ నెల 25న రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు రవికిరణ్‌. ‘‘ఈ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అన్నారు దర్శకుడు. షకలక శంకర్, డా. శివప్రసాద్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బుల్గానిన్, కెమెరా: సారంగం ఎస్‌.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement