శాన్వి... ద డైరెక్టర్‌!

Sanvi Srivastav Is The Heroine of Mufti Kannada Movie - Sakshi

నిజమే.. శాన్వీ శ్రీవాత్సవ కథలు రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే... డైరెక్టర్‌ కాలనుకుంటున్నారు కనుక! ఇంతకీ, ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? లవ్‌లీ, అడ్డా, రౌడీ, ప్యార్‌ మే పడిపోయానే వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన అమ్మాయే... ఈ శాన్వీ! ఇప్పుడు కన్నడలో ఫుల్‌ బిజీ హీరోయిన్‌. లాస్ట్‌ టు ఇయర్స్‌లో ఏడు సినిమాలు చేశారు. ఇప్పుడామె డైరెక్టర్‌ కావాలనుకుంటున్నది రియల్‌ లైఫ్‌లో కాదు... రీల్‌ లైఫ్‌లో! శివ రాజ్‌కుమార్, శ్రీమురళీ హీరోలుగా నటిస్తున్న కన్నడ సినిమా ‘మఫ్టీ’. అందులో శ్రీమురళికి జోడీగా, డైరెక్టర్‌ కావాలనుకునే పాత్రలో శాన్వి నటిస్తున్నారు. అదండీ సంగతి!!

Back to Top