'ద గుడ్ మహారాజా'గా సంజయ్ దత్ | Sanjay Dutt The Good Maharaja First Look | Sakshi
Sakshi News home page

'ద గుడ్ మహారాజా'గా సంజయ్ దత్

Aug 31 2017 10:30 AM | Updated on Sep 12 2017 1:29 AM

ప్రస్తుతం భూమి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ తన నెక్ట్స్

ప్రస్తుతం భూమి సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ తన నెక్ట్స్ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న భూమి తరువాత ఓ చారిత్రక చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం సంజయ్ లీడ్ రోల్ లో భూమి చిత్రాన్ని రూపొందిస్తున్న ఒమంగ్ కుమార్ దర్శకత్వంలోనే ద గుడ్ మహారాజా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో సంజయ్ దత్, నవానగర్ మహారాజా సాహిబ్ దిగ్విజయ్ సింగ్జీ రజింత్ సింగ్జీ పాత్రలో కనిపించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వందలాది చిన్నారలకు ఆశ్రయం కల్పించిన సాహిబ్ చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఇప్పడు అదే కథను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు ఒమాంగ్ కుమార్. పోలిష్ ఇంగ్లీష్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాను తెరకెక్కించనున్నాయి.

తమకు మహారాజాకు సంబంధించిన కొన్ని ఫోటోలు లభ్యమయ్యాయని తెలిపిన దర్శకుడు వాటి ఆధారంగానే సంజయ్ దత్ లుక్ ను డిజైన్ చేసినట్టుగా తెలిపారు. అయితే కొన్ని విషయాల్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని వెల్లడించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ చిత్రంగా తెరకెక్కించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement