థర్డ్ లుక్ తో అమీర్ ఖాన్ మళ్లీ ఝలక్ | Sanjay Dutt debuts in 'PK' third poster, Aamir dons cop avatar | Sakshi
Sakshi News home page

థర్డ్ లుక్ తో అమీర్ ఖాన్ మళ్లీ ఝలక్

Sep 16 2014 9:08 PM | Updated on Sep 2 2017 1:28 PM

విడుదలకు ముందే పోస్టర్లతో 'పీకే' చిత్రం సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఫస్ట్ లుక్ లో నగ్నంగా దర్శనమిచ్చి సంచలనంతో వివాదం రేపిన అమీర్ ఖాన్..

విడుదలకు ముందే పోస్టర్లతో 'పీకే' చిత్రం సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఫస్ట్ లుక్ లో నగ్నంగా దర్శనమిచ్చి సంచలనంతో వివాదం రేపిన అమీర్ ఖాన్.. సెకండ్ లుక్ లో భోజ్ పూరి డ్రస్ లో బ్యాండ్ వాలాగా కనిపించారు.
 
సెప్టెంబర్ 16 తేది మంగళవారం విడుదల చేసిన థర్డ్ లుక్ పోస్టర్ లో ఈసారి అమీర్ తో పాటు సంజయ్ దత్ కూడా ఉన్నారు. http://img.sakshi.net/images/cms/2014-09/81410885839_Unknown.jpg
 
తాజా పోస్టర్ లో అమీర్ ఖాన్ యాంగ్రీ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా డిఫరెంట్ లుక్ తో ఎంట్రీ ఇచ్చారు. ఈ థర్డ్ లుక్ లో ట్రాన్సిస్టర్ ను కూడా వెంట తెచ్చుకున్నారు. థర్డ్ లుక్ వీడియోను సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.
 
తొలుత 'సత్యమేవ జయతే' కార్యక్రమ ప్రోమోను పోస్ట్ చేసి అభిమానులకు భోజ్ పూరి భాషలో ఝలక్ ఇచ్చారు. పొరపాటున టీవీ ప్రోగ్రాం యాడ్ వేసాను. ఇప్పుడు చూడండి పీకే వీడియో అంటూ రెండవ ట్వీట్ లో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement