అంతా అబద్ధం.. నన్నెవరు వేధించలేదు : హీరోయిన్‌ | Sanjana Sanghi Break Silence On Sexual Harassment Claims | Sakshi
Sakshi News home page

అంతా అబద్ధం.. నన్నెవరు వేధించలేదు : హీరోయిన్‌

Oct 24 2018 1:00 PM | Updated on Oct 24 2018 1:02 PM

Sanjana Sanghi Break Silence On Sexual Harassment Claims - Sakshi

సంజనాతో తాను జరిపిన చాట్‌ వివరాలను సుశాంత్‌ బహిర్గతం చేశాడు.

సుశాంత్‌ రాజ్‌పుత్‌ సింగ్‌, సంజనా సంఘీ జంటగా తెరకెక్కుతున్న హిందీ సినిమా ‘కీజీ ఔర్‌ మానీ’. నాలుగేళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్‌ మూవీ ‘ద ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ సినిమాకు రీమేక్‌గా రూపొం‍దుతున్న ఈ సినిమాతో నటుడు ముకేశ్‌ చాబ్రా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సుశాంత్‌, సంజనాతో‌ తప్పుగా ప్రవర్తించడంటూ రూమర్లు ప్రచారమయ్యాయి. ఈ కారణంగానే సంజనా సెట్స్‌కు కూడా రావడం మానేశారని వార్తలు వెలువడ్డాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా మీటూ ఉధృతమైన నేపథ్యంలో సుశాంత్‌ కూడా లైంగిక వేధింపులకు పాల్పడే మనిషేనని, అతడి వల్ల సంజనా ఇబ్బంది పడ్డారంటూ పలువురు నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తన నిజాయితీని నిరూపించుకునేందుకు సంజనాతో తాను జరిపిన చాట్‌ వివరాలను సుశాంత్‌ బహిర్గతం చేశాడు. వరుస ట్వీట్లతో నెటిజన్లకు సమాధానమిచ్చాడు. ఈ విషయంపై స్పందించిన సంజనా.. ‘యూఎస్‌ ట్రిప్‌ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. కీజీ ఔర్‌ మానీ సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement