ముంబయ్‌ అమ్మాయ్‌ సాంబార్‌ చేసిందోయ్‌!

ముంబయ్‌ అమ్మాయ్‌ సాంబార్‌ చేసిందోయ్‌!


వాట్‌... హన్సిక సాంబార్‌ చేశారా? అని  నోరెళ్లబెట్టొద్దు! ఎందుకంటే... సాంబార్‌ ఒక్కటే కాదు, పన్నీర్‌ బటర్‌ మసాలా కూడా హన్సిక కుకింగ్‌ మెనూలో స్పెషల్‌ డిష్‌!! ఎప్పుడూ షూటింగులు, ప్యాకప్‌ చెప్పిన తర్వాత లగేజ్‌ ప్యాకింగులు, కాస్త ఖాళీ దొరికితే స్క్రిప్టు మీటింగులు... ఎప్పుడో గానీ హన్సికకు ఫ్రీ–టైమ్‌ దొరకదు. కానీ, శనివారం లక్కీగా కాస్త టైమ్‌ దొరికింది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి కుకింగ్‌ మొదలెట్టారు.ఏదో పార్ట్‌–టైమ్‌ షెఫ్‌లా గరిటె తిప్పలేదట! మాస్టర్‌ షెఫ్‌లా మారి సాంబార్, పన్నీర్‌ బటర్‌ మసాలా చేశానని హన్సిక పేర్కొన్నారు. స్టవ్‌ మీదనుంచి దించిన తర్వాత సాంబార్, పన్నీర్‌ బటర్‌ మసాలాలకు మేకప్‌ కూడా చేశారండోయ్‌! కుకింగ్‌ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే... కొత్తిమీరతో గార్నిష్‌ చేయడం అన్నమాట! ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ మేటర్‌ ఏంటంటే... హన్సికది ముంబయ్‌. కానీ, ఆమె ఎక్కువగా నటిస్తున్నది సౌతిండియన్‌ సిన్మాల్లోనే. ఇక్కడ షూటింగులు చేస్తున్నప్పుడు చెన్నై సాంబర్‌ రుచి చూశారు. విపరీతంగా నచ్చేయడంతో అప్పుడప్పుడూ ముంబయ్‌ వెళ్లినప్పుడు ఇంట్లో సరదాగా సాంబార్‌ చేసుకుని తింటుంటారట!!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top