సాయిపల్లవి నటనకు ఫిదా అయినా సమంత | samantha say congrats to sai pallavi and fidaa movie team | Sakshi
Sakshi News home page

సాయిపల్లవి నటనకు ఫిదా అయినా సమంత

Published Sat, Jul 29 2017 7:05 PM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

సాయిపల్లవి నటనకు ఫిదా అయినా సమంత

హైదరాబాద్:  వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’  ఇప్పటికే చాలా మందిని ఫిదా చేసేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే హీరోయిన్ సాయి పల్లవి తన నటనతో అందరిని అకట్టుకుంది. తెలంగాణ యాసతో చాలా బాగా మాట్లాడింది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులతోపాటు చాలా మంది ప్రముఖులు  సోషల్ మీడియాతో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చూసిన సమంత తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

‘‘ఫిదా సినిమా చాలా అందంగా, రిఫ్రిసింగ్గా ఉంది. శేఖర్ కమ్మల, వరుణ్ తేజ్ తోపాటు మొత్తం చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు‘‘ అని సమంత ట్వీట్ చేశారు. అంతేకాక సాయి పల్లవిని పోగిడేశారు. సాయి పల్లవి చాలా అద్భుతంగా, అందంగా నటించారని చెప్పారు. సమంత ప్రేక్షకులకు సాయిపల్లవి నటించిన ఏ చిత్రానైనా చూడండని సూచించారు.

హీరోయిన్ సాయిపల్లవి సమంత ట్వీట్ కు స్పందించి  ‘‘మీకు ధన్యవాదాలు‘‘ అని ట్వీట్ చేశారు. ఫిదా చిత్రం జూలై 21న విడుదల అయింది. భానుమతి పాత్రలో సాయి పల్లవి  చాలా అద్భుతంగా నటించారు.  ప్రముఖ డ్యాన్స్ ప్రోగ్రామ్లో కంటెస్టేంట్గా పాల్గొని అందరిని ఆకర్షించింది.  అంచలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. మలయాళం ప్రేమమ్ సినిమాలో కూడా సాయిపల్లవి చాలా అద్భుతంగా నటించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement