మరోసారి.. నాగ్ సినిమాలో సమంత?

Samantha and Nagarjuna in Manam - Sakshi

అక్కినేని వారి కోడలు సమంత మరోసారి మామ నాగార్జున తో కలిసి నటించేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే మనం, రాజుగారి గది 2 లాంటి సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఓ డిఫరెంట్ సినిమా కోసం స్క్రీన్‌ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న నాగ్‌, ఈ నెల 24 నుంచి మరో సినిమాను ప్రారంభించనున్నారు.

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు నాని మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా కన్నడ హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్‌ నటించనుంది. ఈ కాంబినేషన్‌పై ఇంతవరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు.

Back to Top