
జర్నలిస్టుగా సమంత
ఈ మధ్యకాలంలో కన్నడంలో కలెక్షన్ల రికార్డు సృష్టించిన చిత్రం యూటర్న్. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొందనే ప్రచారంతో..
ఈ మధ్యకాలంలో కన్నడంలో కలెక్షన్ల రికార్డు సృష్టించిన చిత్రం యూటర్న్. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొందనే ప్రచారంతో పాటు ఆ చిత్ర తమిళం, తెలుగు భాషల హక్కుల్ని క్రేజీ కథానాయకి, చెన్నై చిన్నది సమంత ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేశారనే ప్రచారం మీడియాలో హోరెత్తింది. అయితే తాను చిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సమంత స్పష్టం చేశారు.అయితే యూటర్న్ చిత్ర రీమేక్‌లో మాత్రం కథానాయకి సంమతనేనని తెలిసింది. కన్నడంలో యూటర్న్ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌కుమార్ తమిళ, తెలుగు భాషల్లో దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతునట్లు తెలిసింది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరు? సమంతతో కలిసి నటించే ఇతర నటీనటులు,సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే దర్శకుడు ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇది నగరంలో వరుసగా జరిగే అనుమానాస్పద హత్యల్లో మర్మాన్ని ఛేదిండానికి రంగంలోకి దిగిన ఒక మహిళా విలేకరి ఇతివృత్తమే యూటర్న్ చిత్ర కథ. ఈ చిత్రంలో ఆ పాత్రలో నటించడానికి నటి సమంత ఎప్పుడెప్పుడాని ఉవ్వెళూరుతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.