హృదయాన్ని హత్తుకునే జాను

Samantha And Sharwanand 96 Remake Titled Jaanu - Sakshi

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రానికి ‘జాను’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిరి్మంచారు. మంగళవారం చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. తమిళంలో విజయ్‌ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రానికి ‘జాను’ తెలుగు రీమేక్‌. తమిళ ‘96’ చిత్రాన్ని తెరకెక్కించిన సి.ప్రేమ్‌కుమారే ‘జాను’కు దర్శకుడిగా వ్యవహరించారు. హీరో హీరోయిన్ల మధ్య చిన్నప్పుడు ప్రేమ చిగురించడం, కొన్ని కారణాల వల్ల కొంతకాలం ఒకరికొకరు దూరం కావడం, ఆ తర్వాత స్కూల్‌ రీ–యూనియన్‌లో భాగంగా కలుసుకున్నప్పుడు వారి భావోద్వేగాలు.. అనే అంశాల నేపథ్యంలో ‘96’ చిత్రకథనం ఉంటుంది.

‘‘శర్వానంద్, సమంతల కాంబినేషన్‌లో రూపొందిన తొలి చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. అందమైన, హృదయాన్ని హత్తుకునే ఈ ప్రేమకథను  ప్రేమ్‌కుమార్‌ చక్కగా తెరకెక్కించారు. గోవింద్‌ వసంత్‌ (‘96’ చిత్రం సంగీత దర్శకుడు) అందించిన సంగీతం, మహేంద్రన్‌ జయరాజ్‌ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు బలం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ‘జాను’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని తెలిసింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top