అందరికీ ధన్యవాదాలు

Samantha and Naga Chaitanya cosy up in Ibiza - Sakshi

ప్రస్తుతం అక్కినేని కుటుంబం హాలీడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విదేశాలు వెళ్లారు. ఇద్దరు మాత్రమే కాదు.. వీళ్ల వెంట అఖిల్‌ కూడా స్పెయిన్‌ తీరప్రాంతంలోని ఇబిసా ప్రాంతానికి వెళ్లారు. అంతే కాదండోయ్‌.. నాగార్జున, ఆయన సతీమణి అమల కూడా ఈ సరదా ట్రిప్‌లో జాయిన్‌ అయ్యారు. ఈ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సమంత. వీటిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా సమంత వస్త్రధారణను విమర్శిస్తున్నారు. ఇలాంటి దుస్తుల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్‌? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సమంత ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో ఓ మేసేజ్‌ ఉంచారు.

‘‘నా పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో చెబుతున్న వారందరికీ అంటూ... ఓ అసభ్యకరమైన సింబల్‌ని పోస్ట్‌ చేసి, ధన్యవాదాలు’’ అంటూ ముగించారు. అంటే.. పరోక్షంగా సమంత నా జీవితం.. నా ఇష్టం అనేలా చెబుతున్నట్లు ఉంది కదూ. ఇప్పుడు వీటిపై కూడా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి రోజు దగ్గర పడుతున్న (అక్టోబర్‌ 6) సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత చేయబోతున్న చిత్రం ఆ రోజు ప్రారంభం అవుతుందట. దీనికి ‘మజిలీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేయబోతున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా నవంబర్‌ 2న విడుదల కానుంది. అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top