ఐటమ్‌ భాయ్‌? | Salman Khan to replace Malaika Arora and turn Munna Badnaam | Sakshi
Sakshi News home page

ఐటమ్‌ భాయ్‌?

May 9 2019 12:08 AM | Updated on May 9 2019 12:08 AM

Salman Khan to replace Malaika Arora and turn Munna Badnaam - Sakshi

సల్మాన్‌ ఖాన్

మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలకు స్పెషల్‌ అట్రాక్షన్‌ ‘ఐటమ్‌ సాంగ్‌’. ఆ స్పెషల్‌ సాంగ్‌ను టాప్‌ హీరోయిన్స్‌ లేదా ఐటమ్‌ గాళ్స్‌తో డ్యాన్స్‌ చేయించాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. తాజాగా ‘మా సినిమాలో ఐటమ్‌ సాంగ్‌కు ఎవ్వరూ అవసరం లేదు’ అనుకుంటున్నారట సల్మాన్‌ ఖాన్, ‘దబాంగ్‌ 3’ చిత్రబృందం. బాలీవుడ్‌ భాయ్‌ సల్మాన్‌  తన కొత్త చిత్రం ‘దబాంగ్‌ 3’ కోసం ఐటమ్‌ భాయ్‌ కాబోతున్నారని బాలీవుడ్‌ టాక్‌. ‘దబాంగ్‌’లో  ‘మున్నీ బద్నామ్‌ హుయి డార్లింగ్‌ తేరేలియే....’ అంటూ సాగే స్పెషల్‌సాంగ్‌ ఆ సినిమాకే హైలైట్‌. మలైకా అరోరా వేసిన స్టెప్స్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌.

‘దబాంగ్‌ 2’లో కరీనా కపూర్‌తో ‘ఫేవికాల్‌ సే’ సాంగ్‌ను తెరకెక్కించారు. ఆ పాట కూడా సూపర్‌ హిట్‌. తాజాగా ‘దబాంగ్‌ 3’లో ఐటమ్‌ నంబర్‌ ఎలా ఉంటుందని ఫ్యాన్స్‌ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దబాంగ్‌ 3’ స్పెషల్‌ సాంగ్‌లో కాలు కదపడం లేదని మలైకా స్పష్టం చేశారు. ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌ ఎవరు చేస్తారని చూస్తుంటే ఓ క్రేజీ న్యూస్‌ తెలిసింది. ‘దబాంగ్‌’ ఐటమ్‌ సాంగ్‌ సిరీస్‌లో ట్విస్ట్‌ వచ్చింది. ‘దబాంగ్‌’ ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న ‘మున్నీ బద్నామ్‌...’ను మున్నాగా మార్చి కొత్త పాట రాస్తున్నారట. ఈ కొత్త లిరిక్స్‌కు మ్యాచింగ్‌గా సల్మానే స్టెప్స్‌ వేయబోతున్నారట. ఇదే నిజమైతే సల్మాన్‌ ట్రేడ్‌మార్క్‌ స్టెప్స్‌ అభిమానులకు విందు అవుతాయని చెప్పొచ్చు. డిసెంబర్‌ 20న రిలీజ్‌ కానున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement