మామతో తొలిప్రేమ... మేనల్లుడితో..! | Saidhiram Tej doing film with Karunakaran | Sakshi
Sakshi News home page

మామతో తొలిప్రేమ... మేనల్లుడితో..!

May 24 2017 1:09 AM | Updated on Sep 5 2017 11:49 AM

మామతో తొలిప్రేమ... మేనల్లుడితో..!

మామతో తొలిప్రేమ... మేనల్లుడితో..!

పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌కు పునాది వేసిన తొలి సినిమా ‘తొలిప్రేమ’. దీని తర్వాత ఆయన పలు హిట్‌ సినిమాల్లో నటించారు.

పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌కు పునాది వేసిన తొలి సినిమా ‘తొలిప్రేమ’. దీని తర్వాత ఆయన పలు హిట్‌ సినిమాల్లో నటించారు. కానీ, పవన్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులకు ‘తొలిప్రేమ’ అంటే ఎంతో స్పెషల్‌. ఇప్పుడీ చిత్రదర్శకుడు ఎ. కరుణాకరన్‌తో పవన్‌ మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సినిమా చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

 ‘‘ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. ఎందుకంటే... ప్రేమ కోసం ఏం చేయడానికైనా యువత రెడీ కాబట్టి’’ అనే థీమ్‌ బేస్‌ చేసుకుని హ్యూమర్‌ అండ్‌ యాక్షన్‌తో కూడిన ప్రేమకథను కరుణాకరన్‌ రెడీ చేశారట! దీనికి సాయిధరమ్‌ తేజ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట. ప్రస్తుతం బీవీఎస్‌ రవి దర్శకత్వంలో ‘జవాన్‌’ చేస్తున్న ఈ హీరో, ఆ తర్వాత కరుణాకరన్‌ సినిమా ప్రారంభిస్తారని సమాచారం. మామతో ‘తొలిప్రేమ’ వంటి హిట్‌ అందుకున్న దర్శకుడు, మేనల్లుడితోనూ హిట్‌ సినిమా చేస్తారని ఊహించవచ్చు!!

Advertisement
 
Advertisement
Advertisement