‘అవును.. 2 కోట్ల యాడ్‌కు నో చెప్పా’

Sai Pallavi Opens up on Rejecting Fairness Cream Ad - Sakshi

‘ప్రేమమ్‌’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సాయి పల్లవి తరువాత సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. మలయాళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినా తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సూర్య సరసన హీరోయిన్‌గా నటించిన ‘ఎన్జీకే’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో సాయి పల్లవి ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ యాడ్‌లో నటించేందుకు నో చెప్పినట్టుగా వార్తలు వినిపించాయి. 2 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినా.. ఈ బ్యూటీ నో చెప్పారన్న వార్త ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఆ వార్తలపై సాయి పల్లవి స్పందించారు.

పింక్‌విల్లా కథనం మేరకు ‘ఇది భారతీయుల రంగు. మనం విదేశీయుల దగ్గరికి వెళ్లి మీరెందుకు తెల్లగా ఉన్నారని అడగం. అది వారి రంగు.. ఇది మన రంగు. ఆఫ్రికన్స్‌కు కూడా వారి రంగు వారికుంది. వారంతా అందంగానే ఉన్నారు. ఆ యాడ్‌ చేయటం ద్వారా వచ్చే డబ్బు నేనేం చేసుకుంటాను. ఇంటికెళ్లి మూడు చపాతిలు తిని, కారులో షికారు చేస్తాను. అంతకం‍టే నాకు పెద్దగా అవసరాలు లేవు. నేను నా చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచగలిగితే చాలు’  అని సాయి పల్లవి వెల్లడించినట్టుగా పింక్‌విల్లా పేర్కోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top