
సాక్షి, సినిమా : మన హీరోయిన్లు గ్లామరస్, టాప్‌లెస్ ఫోటోలతో పత్రిక ముఖ చిత్రాల్లో దుమ్ము రేపుతున్నారు. ఇక సినిమాల్లోనూ అర్ధనగ్నంగా నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇక ఈత దుస్తులు, అరకొర దుస్తులను ధరించి నటించడానికి అభ్యంతరం చెప్పడం లేదు. మరి కొందరైతే అడిగి మరీ లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి వివాదాలతో వార్తల్లో ఉండాలని కోరుకుంటున్నారు. అదేమంటే సినిమా గ్లామర్ ప్రపంచం అని, అయినా గ్లామర్‌గా నటించడంలో తప్పేంటి? లాంటి ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో గ్లామరస్ దుస్తులా సారి. మేము గ్లామర్‌కు దూరం అనే హీరోయిన్లు ఉంటారా? ఉన్నారంటున్నారు సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరి లాంటి వాళ్లు.
మాలీవుడ్ భామలయిన వీరిద్దరూ కోలీవుడ్, టాలీవుడ్ అంటూ వరస పెట్టేస్తున్నారు. అతి తక్కువ కాలంలో టాలీవుడ్‌లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకూ నటించిన చిత్రాల్లో పక్కింటి అమ్మాయిల్లానే కనిపించారు. వీరికి ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నా నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎంచుకుని నటిస్తామంటున్నారు. ఇకపై కూడా అలాంటి ఇమేజ్‌నే కాపాడుకోవాలని భావిస్తున్నట్లు, అందువల్ల గ్లామరస్ పాత్రల్లో నటించే ఆలోచన లేదని చెబుతున్నారు. చూద్దాం ఈ ముద్దుగుమ్మలు తమ మాట మీద ఎంత కాలం నిలబడతారో!