
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్ వివాహం ముగియగా.. అదే దారిలో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా గుర్తింపు పొందిన దగ్గుబాటి రానా, మరో యంగ్ హీరో నితిన్ కూడా పయనిస్తున్నారు. రానా వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ తేజ్ వివాహంపై యువ హీరో సాయి ధరమ్‌తేజ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. 'ఏంటి బావా.. నీకు పెళ్లంట' అని తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నించాడు. (అలా ఫ్లోలో వెళ్లిపోయా)
దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ.. 'నా పెళ్లికి చాలా టైమ్ ఉందిలే కానీ, దగ్గుబాటి రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే అని నమ్మించి సింగిల్స్ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు' అంటూ కామెంట్ చేశాడు. వీరి మధ్యలో కమెడియన్ వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. ‘నేను ఎప్పటికీ సింగిల్‌గా ఉంటాను, సింగిల్‌గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది, పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది అంటూ స్పందించాడు’ ధరమ్ తేజ్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
Enti bava @IAmVarunTej neeku pellanta? 😱😱😱 pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020