ప్రకృతే సాక్ష్యం | Saakshyam Audio Launch on July 7th | Sakshi
Sakshi News home page

ప్రకృతే సాక్ష్యం

Jun 30 2018 1:00 AM | Updated on Aug 22 2019 9:35 AM

Saakshyam Audio Launch on July 7th - Sakshi

బెల్లంకొండ శ్రీనివాస్

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించారు. జగపతిబాబు, శరత్‌ కుమార్, మీనా, రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్‌ కీలక పాత్రలు చేశారు. హర్షవర్ధన్‌ రామేశ్వరన్‌ స్వర పరచిన ఈ సినిమా ఆడియోను జూలై 7న విడుదల చేయనున్నారు.

‘‘ప్రకృతే సాక్ష్యంగా ఈ సినిమాను రూపొందించాం. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఆర్తు ఏ.విల్సన్‌ అందించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలం. ‘బాహుబలి’ చిత్రానికి సీజీ వర్క్‌ చేసిన టీమ్‌ ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. టైమ్‌ మ్యూజిక్‌ సౌత్‌ సంస్థ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. జూలై 20న ‘సాక్ష్యం’ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement