సర్‌ప్రైజ్‌ చేయమన్నందుకు...ఇదిగో ఇలా!!

Riteish Deshmukh Surprised Genelia With His New Look - Sakshi

‘తుజే మేరీ కసమ్‌’ సినిమాలో కలిసి నటించిన రితేశ్‌ దేశ్‌ముఖ్‌- జెనీలియా బీ-టౌన్‌ ప్రేక్షకులను ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ జోడీ కట్టారు. పెళ్లికి పెద్దల ఆమోదం లభించకపోవడంతో కొన్నాళ్లు స్నేహితులుగానే ఉన్న ఈ స్టార్‌ కపుల్‌.. పన్నెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వివాహ బంధంతో ఒక్కటై కపుల్‌ గోల్స్‌ను సెట్‌ చేశారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులతో క్యూట్‌ ఫ్యామిలీ కలిగి ఉన్న ఈ జంట సోషల్‌ మీడియాలో తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలోనూ ముందుంటారన్న సంగతి తెలిసిందే.

తాజాగా జెనీలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన రితేశ్‌ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ సరికొత్త లుక్‌తో నన్ను సర్‌ప్రైజ్‌ చేయమని రితేశ్‌ను అడిగాను. ఇదిగో తను ఇలా ఎర్ర రంగు ఉడుత తోకతో నా ముందుకు వచ్చాడు... కూల్‌గా ఉంది కదా!!’  అంటూ రితేశ్‌ న్యూలుక్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో.. ‘మీ మాటకు విలువనిచ్చి రితేశ్‌ ఇలా తయారయ్యాడా? గ్రేట్‌. మాకు కూడా చెప్పండి ఈ హెయిర్‌స్టైల్‌ పేరేమిటో. మీ జంట ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి’  అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా రితేశ్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడన్న సంగతి తెలిసిందే. ఇక రితేశ్‌తో కలిసి తొలిసారి వెండితెరపై సందడి చేసిన జెనీలియా అతడిని పెళ్లి చేసుకుని ప్రస్తుతం కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top