
అందుకే అంజలిని తీసుకున్నారట..!
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్, ఆ సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిస్సాలతో గ్లామరస్గా కనిపిస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరో స్పెషల్ ఎట్రాక్షన్ యాడ్ అయ్యింది. చాలా రోజులుగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ విషయంలో టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. బన్నీ పక్కనే డ్యాన్స్ చేయడానికి, స్టార్ హీరోయిన్ కోసం వెదుకుతున్నారు చిత్రయూనిట్.
అనుష్క, ఇళియానా లాంటి స్టార్ల పేర్లు వినిపించాయి. తరువాత లోఫర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశ పటాని బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ వినిపించింది. అయితే ఇవన్ని కాదని ఓ తెలుగింటి అమ్మాయిని స్పెషల్ సాంగ్కు ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు బోయపాటి. డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆకట్టుకుంటున్న అంజలి సరైనోడు సినిమాలో బన్నీతో కలిసి చిందేయడానికి రెడీ అవుతోంది.
ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది అంజలి. అంతేకాదు తననే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవటం వెనుక ఉన్న కారణం కూడా చెప్పింది. శంకరాభరణం సినిమాలో అంజలి చేసిన మాస్ క్యారెక్టర్, ఆ సినిమాలో ఆమె చేసిన 'ఘంటా..' పాటలో తన డ్యాన్స్ చూసిన బోయపాటి బన్ని సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నాడని చెపుతోంది ఈ బ్యూటీ