గాల్లో తేలిన రాశీఖన్నా! | Rasikhanna sky diving! | Sakshi
Sakshi News home page

గాల్లో తేలిన రాశీఖన్నా!

Jul 8 2016 2:40 AM | Updated on Sep 4 2017 4:20 AM

గాల్లో తేలిన రాశీఖన్నా!

గాల్లో తేలిన రాశీఖన్నా!

గాల్లో తేలే ఆటలు ఆడటమంటే గుండె ధైర్యం కావాలి. స్కై డైవింగ్ ద్వారా ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన హీరోలు చాలామందే ఉన్నారు.

గాల్లో తేలే ఆటలు ఆడటమంటే గుండె ధైర్యం కావాలి. స్కై డైవింగ్ ద్వారా ఆ ధైర్యాన్ని ప్రదర్శించిన హీరోలు చాలామందే ఉన్నారు. హీరోయిన్లలో కూడా సరదాగా గాల్లో తేలినవాళ్లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రాశీఖన్నా చేరారు. ఈ ఢిల్లీ బ్యూటీ ఎప్పట్నుంచో స్కై డైవ్ చేయాలనుకుంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారామె. 14000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేశారు. అంత ఎత్తు నుంచి దూకడం ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించిందని రాశి పేర్కొన్నారు.


గాల్లో తేలుతున్నప్పుడు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని కూడా అన్నారామె. ఇంతకీ రాశీఖన్నా ఎక్కడ స్కై డైవ్ చేశారనే విషయంలోకి వస్తే.. తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల అమెరికాలో జరిగిన ‘ఆటా’ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె అక్కడికెళ్లారు. అమెరికాలో స్కె డైవ్ చేశారు. గాల్లో తేలుతున్న ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అది చూసినవాళ్లు.. ‘పైకి సుకుమారంగా కనిపించే రాశి ధైర్యవంతురాలే’ అని కితాబులిచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement