ఆగస్టు 24న ‘అంతకు మించి’ | Rashmi Gautam Anthaku Minchi Movie Release Date | Sakshi
Sakshi News home page

Aug 5 2018 11:00 AM | Updated on Aug 5 2018 11:00 AM

Rashmi Gautam Anthaku Minchi Movie Release Date - Sakshi

జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ అంతుకు మించి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 24న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ను  ప్రకటించిన ఆర్‌ ఎక్స్‌100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే అంతకుమించి సినిమాలో కనపడుతోంది. ట్రైలర్ చాలా బాగుంది, రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి. ఇక ఈ చిత్ర హీరో కమ్ నిర్మాత జై నాకు మంచి  మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా. ఈ చిత్రం ఆగస్టు 24న విడుదలవుతోంది తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నాను’ అన్నారు. 

దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘మా సినిమా  ట్రైలర్ ను సుకుమార్ గారు విడుదల చేశారు.. మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మీ గారు చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్  కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. ఇది నా డెబ్యూ. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. 

హీరో జై మాట్లాడుతూ.. ‘సినిమా లాస్ట్ టూ రీల్స్ లో ఆడియన్స్ కచ్చితంగా భయపడతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో టైటిల్ పడుతుంది. అంతకు మించి అని అప్పుడు అర్థం అవుతుంది ఈ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని. రష్మీ గారు అల్టిమేట్ పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రాణం పోశారు. మా సహ నిర్మాతలు భాను, కన్నాలు నాకు ఎంతగానో సహకరించారు. అందుకే ఈ సినిమా ఇంతబాగా వచ్చింది. ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది’ అని అన్నారు.

హీరోయిన్ రష్మీ మాట్లాడుతూ.. ‘అందరి ఎఫర్ట్ ఈ అంతకు మించి సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాము. నిర్మాతల ముఖాల్లో స్మైల్ కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు మంచి టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉంది. ఈ చిత్రం ఎక్కువగా నైట్ షూట్స్ చేశాము. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. సినిమా హారర్ థ్రిల్లర్ గనుక అందరికీ నచ్చి తీరుతుందని భావిస్తున్నా’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement