వాచ్‌ వచ్చె

Ranveer Singh gets swanky watch as birthday gift from Rohit Shetty - Sakshi

అందరికీ బర్త్‌డేకి అడ్వాన్స్‌ విషెస్‌ లభిస్తాయి. కానీ బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌కి అడ్వాన్స్‌ బర్త్‌డే గిఫ్ట్స్‌ లభిస్తున్నాయి. రణ్‌వీర్‌ బర్త్‌ డే ఈనెల 6న. వారం ముందే ఓ మంచి వాచ్‌ గిఫ్ట్‌గా బçహూకరించారట దర్శకుడు రోహిత్‌ శెట్టి. తెలుగు హిట్‌ మూవీ ‘టెంపర్‌’ హిందీ రీమేక్‌ ‘సింబా’లో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్‌లో రణ్‌వీర్‌కు రోహిత్‌ శెట్టి వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట. ‘‘బాస్‌ (రోహిత్‌ శెట్టి) ఓ వారం ముందే బర్త్‌డే ప్రజెంట్‌ ఇచ్చేశారు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే సూపర్‌ వాచ్‌.  థ్యాంక్యూ సార్‌’’ అంటూ ఈ విషయాన్ని ట్వీటర్‌లో తెలిపారు రణ్‌వీర్‌ సింగ్‌. ‘సింబా’ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 28న రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top