రణ్‌దీప్‌ హుడాపై మండిపడిన రంగోలి

Rangoli Chandel Lashes Out At Randeep Hooda - Sakshi

కంగనా రనౌత్‌, ఆలియా భట్‌ల మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పటిలో ఆగేలా లేదు. ప్రత్యక్షంగా వీరిద్దరూ దీన్ని ప్రోత్సాహించకున్నా.. వారి తరఫున ఎవరో ఒకరు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రణ్‌దీప్‌ హుడా, కంగనా సోదరి రంగోలి రంగంలోకి దిగారు. విషయం ఏంటంటే ఆలియాతో కలిసి హైవే చిత్రంలో నటించిన రణ్‌దీప్‌ హుడా.. ఆమె ప్రతిభను పొగుడుతూ.. ఓ ట్వీట్‌ చేశాడు. అయితే దానిలో ఎక్కడా కూడా కంగనా పేరు ప్రస్తావించలేదు. ‘ప్రియమైన ఆలియా.. నీపై విమర్శలు చేసే వారిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు.. నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ రణ్‌దీప్‌ హుడా ట్వీట్‌ చేశారు.

కానీ రణ్‌దీప్‌ ఇలా ట్వీట్‌ చేసిన కొద్ది సేపటికే రంగోలి ఆయనను విమర్శిస్తూ వరుస ట్వీట్లూ చేశారు. ‘నీవు కరణ్‌ జోహార్‌కు చాలా పెద్ద అభిమానివి.. అందుకే నువ్వు బంధుప్రీతిని ప్రోత్సాహిస్తూ.. ఆలియాను పొగుడుతున్నావ్. ఆలియా లాంటి వారు కనీసం చంచాగిరి చేసైనా విజయం సాధిస్తున్నారు. కానీ నువ్వు ఇంకా ఓ ఫెయిల్యూర్‌ యాక్టర్‌వే. ఉంగ్లీ సినిమా సమయంలో నువ్వు కంగనాని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలుసు’ అంటూ రంగోలి ట్వీట్లు చేశారు. మరి దీనిపై ఎలాంటి రియాక్షన్లు వస్తాయో చూడాలి.

అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన పోల్‌. దీనిలో 2019లో ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ఉత్తమ నటి విభాగంలో కంగనా, ఆలియా పోటీలో ఉన్నారు. దీనిపై కంగనా స్పందిస్తూ.. ఆలియా ఒక సాధరణ నటి. ఆమెతో తనను పోల్చడం చాలా ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతూనే ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top