ఆ విందు వెనక రహస్యం ఏంటి? | Ranbir Kapoor, Katrina Kaif enjoy dinner with his mom Neetu Kapoor | Sakshi
Sakshi News home page

ఆ విందు వెనక రహస్యం ఏంటి?

Apr 12 2015 10:32 PM | Updated on Sep 3 2017 12:13 AM

ఆ విందు వెనక రహస్యం ఏంటి?

ఆ విందు వెనక రహస్యం ఏంటి?

కపూర్ కుటుంబం కైఫ్‌ని ఇష్టపడటంలేదు. అసలామె నీడ కూడా తమ మీద పడకూడదనుకుంటున్నారు’’... ప్రస్తుతం హిందీ రంగంలో

‘‘కపూర్ కుటుంబం కైఫ్‌ని ఇష్టపడటంలేదు. అసలామె నీడ కూడా తమ మీద పడకూడదనుకుంటున్నారు’’... ప్రస్తుతం హిందీ రంగంలో రణ్‌బీర్ కపూర్ కుటుంబం, కత్రినా కైఫ్ గురించి ప్రచారమవుతున్న వార్త ఇది. అయితే, ఈ ప్రచారకర్తలకు షాకిస్తూ.. ఒక రోజు క్రితం కపూర్ కుటుంబంతో కత్రినా కైఫ్ విందు ఆరగించారు. కపూర్ కుటుంబానికి చెందిన దిగ్గజాలు కృష్ణరాజ్ కపూర్ (రణ్‌బీర్ నానమ్మ) రణ్‌ధీర్ కపూర్ (ప్రముఖ నటుడు, దర్శక-నిర్మాత, రణ్‌బీర్ మేనమామ), నీతూ సింగ్ (రణబీర్ తల్లి, ప్రముఖ నటి), రణ్‌బీర్ సోదరి రిధిమ తదితరులు ఓ ఐదు నక్షత్రాల హోటల్‌కు వెళ్లారు. కత్రినా కైఫ్ కూడా ఆ విందులో పాల్గొన్నారు.
 
  కపూర్ కుటుంబం ఆమెతో ఆత్మీయంగా కబుర్లు చెప్పడం, కత్రినా కూడా వాళ్లతో కలుపుగోలుగా ఉండడం నలుగురి దృష్టిలో పడింది. అసలీ విందు వెనక ఉన్న రహస్యం ఏంటి? కపూర్ కుటుంబం కత్రినాని తమ ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారా? ఆ విషయం మాట్లాడుకోవడానికే కత్రినాను రమ్మన్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొన్నిరోజుల క్రితం రణ్‌బీర్, కత్రినా గురించి సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్తలకు ‘‘ఏ చిన్న విషయానికైనా.. సామాజిక మాధ్యమం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది’’ అని కత్రినా పేర్కొన్నారు. ఇప్పుడీ విందు విషయానికి కూడా ఆమె అలానే స్పందిస్తారేమో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement