మల్లయోధునిగా...

rana in kodi rammurthynaidu biopic movie - Sakshi

ఆరడుగుల ఆజానుబాహుడు, ధైర్యవంతుడు, బలం ఉన్నవాడు పోరాటానికి సిద్ధపడితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఫిజిక్‌నే మెయింటైన్‌ చేస్తుంటారు హీరో రానా. కామన్‌ రోల్స్‌తో పాటు రాజులు, యోధుల పాత్రలకు కూడా రానా కరెక్ట్‌గా సరిపోతారు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనం. ‘బాహుబలి’ సినిమాలో రానా పోషించిన ‘భల్లాలదేవ’ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు ప్రముఖ మల్లయోధుడు ‘ఇండియన్‌ హెర్క్యూలెస్, కలియుగ భీమ’ అనే బిరుదుల గ్రహీత ‘కోడి రామ్మూర్తి నాయుడు’ పాత్రలో రానా నటించనున్నారు. అంటే మల్లయోధునిగా భల్లాలదేవ కనిపించనున్నారన్నమాట. సౌత్‌కి చెందిన ఒక అగ్రనిర్మాణ సంస్థతో పాటు, ఓ ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందుకోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదిస్తున్నారట. అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ కానుందని టాక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top