మేం సింగిల్‌

Rana Daggubati opens up about his break up with Trisha - Sakshi

ప్రజంట్‌ టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్, రానా టాప్‌లో ఉంటారు. కానీ వీళ్ల రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ల మీద ఫ్యాన్స్‌కు సరైన క్లారిటీ లేదు. అనుష్కతో ప్రభాస్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా వార్తలే వచ్చాయి. ఏకంగా పెళ్లి ఫిక్స్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్త హల్‌ చల్‌ చేసింది. రానా విషయానికొస్తే... అప్పుడప్పుడూ ఎవరో ఒక హీరోయిన్‌తో లింక్‌ పెట్టి వార్తలు వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరూ ‘మేం సింగిల్‌’ అన్నట్లుగానే సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు.

రీసెంట్‌గా బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ హోస్ట్‌ చేసిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలోనూ అదే అన్నారు. ఈ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా పాల్గొన్నారు. జనరల్‌గా ఈ షోలో ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగా ప్రశ్నలు సంధించేస్తారు కరణ్‌. అదే విధంగా.. మీరు, త్రిష రిలేషన్‌షిప్‌లో ఉండేవారట? అని రానాని అడగ్గా – ‘‘మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కొన్ని రోజులు డేటింగ్‌ కూడా చేశాం. ప్రస్తుతానికి నేను సింగిలే’’ అని సూటిగా సమాధానం చెప్పేశారు. అలాగే ప్రభాస్‌ను మీరు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని అడగ్గానే– ‘‘అనుష్క నాకు 8 ఏళ్లుగా తెలుసు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌. వరుసగా కలసి సినిమాలు చేసేసరికి ఇలాంటి వార్తలు వస్తుంటాయి. అందులో వాస్తవం లేదు.

నేనింకా సింగిలే’’ అని సమాధానమిచ్చారు ప్రభాస్‌. మరి తెలుగులో ఎవరు సెక్సియస్ట్‌ హీరోయిన్‌ అన్న ప్రశ్నకు అనుష్క పేరు చెప్పారు ప్రభాస్‌. ఆ వెంటనే.. ఈ సమాధానానికి, మా గురించి ప్రచారమవుతున్న రూమర్‌కీ సంబంధం లేదని ప్రభాస్‌ నవ్వేశారు. ఇక.. రానా, ప్రభాస్‌ ఇద్దరిలో రానాకే త్వరగా పెళ్లి అవుతుంది. ప్రభాస్‌ పెళ్లి లేట్‌ అవ్వడానికి కారణం తన బద్ధకమే అని రాజమౌళి పేర్కొనడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. ప్రొఫెషనల్‌గా మీ విజన్‌తో పోటీగల బాలీవుడ్‌ దర్శకుడు ఎవరైనా ఉన్నారా? అని రాజమౌళిని కరణ్‌ అడగ్గా – ‘లేరు’ అని సమాధానమిచ్చారు. అలాగే రజనీకాంత్, కమల్‌హాసన్‌లలో ఎవర్ని డైరెక్ట్‌ చేయాలని ఉంది? అనే ప్రశ్నకు – ‘‘రజనీకాంత్‌’’ అన్నారు రాజమౌళి. బాలీవుడ్‌ ఖాన్స్‌లో ఎవరిష్టం అన్న ప్రశ్నకు ‘సల్మాన్‌ ఖాన్‌’ పేరు చెప్పారు రాజమౌళి.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top